కాంగ్రెస్కు అవకాశం ఇస్తే పాతాళంలోకి పోతాం : హరీష్ రావు

కాంగ్రెస్ అంటేనే గ్రూప్లు,  మూటలు, మాటలు, మంటలు అని విమర్శించారు మంత్రి హరీష్ రావు.  ‌టిక్కెట్లు ఇవ్వకముందే ఆ పార్టీలో తన్నుకుంటున్నారని,  కాంగ్రెస్కు మళ్ళీ అవకాశం ఇస్తే పాతాళం లోకి పోతామని ఎద్దేవా చేశారు.  జనగామ జిల్లా నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు.  కాంగ్రెస్ పాలన అంటే కరెంట్ కష్టాలు కర్ప్యూలు అని, కేసీఆర్ అంటే నమ్మకమని చెప్పారు . 

సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డికి స్వీట్ తినిపించి ఆలింగనం చేసుకుని ఆశీర్వదించడంతో తనకు ఊహించని సంతోషం కలిగిందన్నారు మంత్రి హరీష్ రావు.  ఈ దృశ్యం చూశాక  ఆకలి అవుతున్నా కడుపు నిండిపోయిందన్నారు . దీంతో జనగామలో  బ్రహ్మాండమైన మెజారిటీతో బీఆర్ఎస్ విజయం ఖాయం అయిపోయిందని చెప్పారు. 

పల్లా రాజేశ్వర్ రెడ్డి తనంత ఎత్తు ఉన్నారని...  అంతే స్థాయిలో జనగామలో అభివృద్ధి చేస్తామని హరీష్ రావు హామీ ఇచ్చారు.   పల్లాతో తనకు 2010లో తెలంగాణ ఉద్యమంలో పరిచయం ఏర్పడిందన్నారు.  అలాంటి పల్లాను సీఎం  కేసిఆర్,  ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆశీస్సులతో జనగామ ఎమ్మెల్యేగా  గెలిపిస్తామని చెప్పారు.