60 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ చేయలేని పనులు సీఎం కేసీఆర్ చేసి చూపించారని మంత్రి హరీష్ రావు అన్నారు. ఇబ్రహీంపట్నంలో ఆయన ప్రచారం చేశారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ స్కీమ్స్ అన్నీ సూపర్ హిట్అని చెప్పారు. ఎవరూ ఎన్ని కుట్రలు చేసినా హ్యాట్రిక్ కొట్టేది కేసీఆర్ అని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ అంటే నమ్మకమని, కాంగ్రెస్ అంటే ఒక నాటకమని తెలిపారు.
Also Read :- నన్ను చంపటానికి కుట్ర
రైతు బంధు ఆపేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. యాసంగి పంటకు రైతుబంధు ఇవ్వొద్దని కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేసిందన్నారు. వ్యవసాయాన్ని దండుగగా మార్చిన చరిత్ర కాంగ్రెస్ ది అని విమర్శించారు. రైతులపై పగబట్టినట్లుగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని చెప్పారు.