మెదక్ లో నేషనల్ రికార్డ్ మెజారిటీ రావాలి : హరీష్ రావు

సంగారెడ్డి పట్టణంలో టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా మాజీ మంత్రి హరీష్ రావు రోడ్ షో నిర్వహించారు. ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ ఇతరులు పాల్గొన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ ల దుకాణాలు బంద్ అవుతాయన్నారు హరీష్ రావు. రాబోయే రోజుల్లో కేంద్రంలో నాన్ బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతోందని చెప్పారు. దేశంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో సెక్యూలర్ ఫ్రంట్ అధికారంలోకి వస్తుందన్నారు. “తెలంగాణ రాష్ట్రం దేశానికి రోల్ మోడల్ గా నిలిచింది. మెదక్ లో టీఆర్ఎస్ గెలుపును ఎవరూ ఆపలేరు. కొత్త ప్రభాకర్ దేశంలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించాలి” అన్నారు హరీష్ రావు.