అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం... కానిస్టేబుల్ కుటుంబానికి హరీష్ రావు పరామర్శ

అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం...  కానిస్టేబుల్ కుటుంబానికి హరీష్ రావు పరామర్శ

తన భార్యాపిల్లలను కాల్చి చంపి..ఎఆర్ కానిస్టేబుల్ నరేష్(35) ఆత్మహత్య చేసుకున్న ఘటనపై సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. డిసెంబర్ 17వ తేదీ ఆదివారం జిల్లాలోని చిన్నకోడూరు మండలం రామునిపట్లలో నరేష్ తల్లిదండ్రులను హరీష్ రావు పరామర్శించారు. దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. అధైర్య పడొద్దని.. అన్ని విధాల తాము అండగా ఉంటామని.. వారికి హరీష్ రావు ధైర్యం చెప్పారు. 

డిసెంబర్ 15వ తేదీ శుక్రవారం సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ వద్ద పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ (గన్మెన్)గా విధులు నిర్వర్తిస్తున్న ఎఆర్ కానిస్టేబుల్ నరేష్.. తన భార్య, పిల్లలను తుపాకీతో కాల్చి చంపి, అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్న దారుణ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. 

ఆన్​లైన్​ బెట్టింగ్​లతో అప్పుల పాలై ఈ దారుణానికి పాల్పడినట్టు తెలుస్తుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.