సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. మార్చాల్సింది విగ్రహాలు కాదు..ప్రజల బతుకలని విమర్శించారు. రేవంత్ రెడ్డి ఏనాడు తెలంగాణ అని అనలేదు.. ఉద్యమంలో పాల్గొనలేదన్నారు. రాజీనామా చేయలేదన్నారు. రేవంత్ తెలంగాణ ద్రోహి అని మండిపడ్డారు. తెలంగాణ వచ్చిందంటే దానికి కారణం కేసీఆర్ అని అన్నారు హరీశ్ . గ్రామాల్లో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాలను రేవంత్ రెడ్డి ఇప్పుడు తొలగిస్తారా..? అని ప్రశ్నించారు.
2015 జూన్ 2న సంగారెడ్డి కలెక్టరేట్ లో మొదటి సారి అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టామన్నారు హరీశ్ రావు. 2023 జూన్ 22 న నాడు సెక్రటేరియట్ దగ్గర కేసీఆర్ తెలంగాణ తల్లి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారని చెప్పారు. తెలంగాణలో ఉన్న తెలుగుతల్లి విగ్రహాన్ని ఎవరైనా మార్చారా అని ప్రశ్నించారు.
కేసీఆర్ 2001లో పార్టీ పెట్టకపోతే తెలంగాణ వచ్చేది కాదన్నారు హరీశ్ రావు. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలన, 16 ఏళ్ల టీడీపీ పాలనలో తెలంగాణ అనే పదం లేకుండా చేశారని విమర్శించారు. 2004 నుంచి 2009 వరకు తమతో పొత్తు పెట్టుకుని తెలంగాణ ఇవ్వకుండా మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ అని ధ్వజమెత్తారు. నవంబర్ 29 లేకపోతే డిసెంబర్ 9 ప్రకటన లేదు. జూన్ 2 లేదన్నారు హరీశ్ రావు.