హైదరాబాద్, వెలుగు: చట్టం.. ఒక్క అల్లు అర్జున్ విషయంలోనే కాకుండా.. రేవంత్ రెడ్డి అండ్ బ్రదర్స్ విషయంలోనూ స్పందించాలని హరీశ్ రావు అన్నారు. ‘‘అసలు బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది ఎవరు? ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా సినిమాను ప్రదర్శించింది ఎవరు?”అని ఆయన ప్రశ్నించారు. తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు.
ఆ ఘటనకు రాష్ట్ర సర్కారే అసలు కారణమని, చర్యలు తీసుకోవాల్సింది కాంగ్రెస్ ప్రభుత్వంపైనేనని పేర్కొన్నారు. అలాగే, మాజీ సర్పంచ్ఆత్మహత్యకు కారణమైన సీఎం రేవంత్ రెడ్డి బ్రదర్స్‌ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు