గత ప్రభుత్వాలు రైతుల వద్ద డబ్బులు తీసుకున్నవి... కేసీఆర్ రైతులకు డబ్బులు ఇస్తుండు

గత ప్రభుత్వాలు రైతుల వద్ద డబ్బులు తీసుకున్నవి... కేసీఆర్ రైతులకు డబ్బులు ఇస్తుండు

గత ప్రభుత్వాలు రైతుల వద్ద డబ్బులు తీసుకునేవని... కేసీఆర్ ప్రభుత్వం రైతులకు డబ్బులు ఇచ్చిందని మంత్రి హరీష్ రావు చెప్పారు.మెదక్ జిల్లా చిన్న శంకరంపేట, నార్సింగి మండలంలో నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో హరీష్ రావు పాల్గొని మాట్లాడారు. రైతు బంధు, రైతు బీమాతో వ్యవసాయం పండగ అయ్యిందన్నారు. పల్లె పల్లేన పల్లర్లు మొలిచే తెలంగాణలోన,  నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన అని నాడు పాటలు ఉండేవని..నేడు ఆ పాటలు తిరగ రాయాల్సిన అవసరం వచ్చిందని ఆయన అన్నారు.

 ఇవన్నీ ఎలా సాధ్యం అయ్యింది?.. మంత్రం వేస్తే అయ్యిందా?.. మాయ చేస్తే అయ్యిందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి కరెంట్ 3 గంటలే చాలు అంటున్నాడని... రైతులకు రూపాయి ఇచ్చిన ముఖమా రేవంత్ రెడ్డిది అని ఫైర్ అయ్యారు. డికె శివకుమార్ ఏకంగా 5 గంటల కరెంట్ చాలు అని తాండూరు మీటింగ్ లో చెప్పాడని.. ఒకరకంగా వాస్తవం చెప్పి మన నెత్తి మీద పాలు పోశాడన్నారు. కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసేందుకు నియోజకవర్గాల్లో అభ్యర్థులే లేరన్నారు. 

ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తి దాడి జరగటం అత్యంత బాధాకరమని.. ఆయన  త్వరగా కోలుకోవాలని మనమందరం ప్రార్థించాలన్నారు. ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ప్రజల్లో ఉండి, నియోజక అభివృద్ధి కోసం కృషి చేశారని.. మంచి మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నానని అన్నారు. మరో ఆరు నెలలు అయితే శంకరం పేటకు కాళేశ్వరం నీళ్ళు వస్తాయని చెప్పారు. తెలంగాణలో ఎకరం అమ్మితే ఏపీలో వంద ఎకరాలు వస్తాయని చంద్రబాబు అన్నాడని..  తెలంగాణలో నేడు ఆకలి చావులు లేవని.. ఎంతో మార్పు వచ్చిందని తెలిపారు. వచ్చే 5 ఏళ్లు కీలకమని.. ప్రపంచ పటంలో ఒక గొప్ప రాష్ట్రంగా తెలంగాణ అభివృద్ధి చెందబోతుందన్నారు. 

ప్రతి రైతుకు ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని కాంగ్రెస్ కుట్ర చేస్తుందని. ఎన్ని ఎకరాలు ఉన్నా రూ.15 వేలే ఇస్తారని అన్నారు. కెసిఆర్ ప్రతి ఎకరాకు రూ.16 వేలు అంటే.. కాంగ్రెస్ ప్రతి రైతుకు రూ.15 వేలు అంటుందని.. ప్రజలు ఆలోచించాలని కోరారు. కేసేఆర్ మళ్లీ గెలిస్తే.. రూ.400లకే గ్యాస్ సిలిండర్.. సౌభాగ్య లక్ష్మి ద్వారా మహిళలకు రూ.3 వేలు ఇస్తామని చెప్పారు. రేషన్ కార్డులు ఉన్న వాళ్లకు 6 కిలోల సన్నబియ్యం ఇస్తామన్నారు. ఆరోగ్య శ్రీ ద్వారా రూ.15 లక్షల చికిత్స ఉచితంగా అందిస్తామని హరీష్ రావు హామీ ఇచ్చారు.