రోడ్ షోలో హరీష్ రావుకు తప్పిన ప్రమాదం

రోడ్ షోలో హరీష్ రావుకు తప్పిన ప్రమాదం

మెదక్ జిల్లాలో మాజీ మంత్రి హారీష్ రావుకు ప్రమాదం తప్పింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా తుప్రాన్ లో  రోడ్ షో నిర్వహించారు. ఆయన ప్రసంగిస్తుండగా  జెనరేట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన కార్యకర్తలు వెంటనే మంటలను అదుపులోకి తేవడంతో అక్కడున్న వారికి ప్రమాదం తప్పింది. దీంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. తర్వాత ప్రచారాన్ని ఆపేసిన హరీష్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, ఇతర నేతలు అక్కడి నుంచి వెళ్లిపోయారు.