అల్లు అర్జున్‎ని అరెస్ట్ చేసి CM రేవంత్ హిట్ వికెట్: హరీష్ రావు

అల్లు అర్జున్‎ని అరెస్ట్ చేసి CM రేవంత్ హిట్ వికెట్: హరీష్ రావు

సిద్దిపేట: హీరో అల్లు అర్జున్‎ను అరెస్ట్ చేసి సీఎం రేవంత్ రెడ్డి హిట్ వికెట్ అయ్యాడని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఆదివారం (డిసెంబర్ 15) ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతు బంధు పెట్టారు.. యాదవులకి గొర్రెల పంపిణి చేయడం బంధు పెట్టారని విమర్శించారు. హైడ్రా పేరుతో కూలగొట్టారు కానీ.. సంవత్సరం పాలనలో ఒక్క నిర్మాణాన్ని అయినా కట్టినావా రేవంత్ రెడ్డి అని ప్రశ్నించారు.

కనిపించిన దేవుండ్లందరి మీద ఒట్టు పెట్టడంతో పాటు లగచర్ల రైతులను జైల్లో పెట్టి సీఎం రేవంత్ రెడ్డి హిట్ వికెట్ అయ్యాడని అన్నారు. సీఎం రేవంత్‎కు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని.. రాహుల్ దగ్గర కూడా రేవంత్ హిట్ వికెట్ అయ్యాడని.. ముఖ్యమంత్రిగా నీ పని అయిపోయిందని హాట్ కామెంట్స్ చేశారు. 

తులం బంగారం ఏదని అడిగితే పండబెట్టి తొక్కుతా అంటుండు.. ఏ ముఖ్యమంత్రి అయినా ఇలా మాట్లాడతారా..? అని అసహనం వ్యక్తం చేశారు. నీ పాలనలో గురుకులాల పిల్లలు చనిపోతున్నారు.. ఆటో కార్మికుల జీవితాలు ఆగమైపోయాయని విమర్శించారు. ఆటో డ్రైవర్లను కాంగ్రెస్ నమ్మించి మోసం చేసిందని.. రాష్ట్రంలోని అన్ని వర్గాలను సీఎం రేవంత్ రెడ్డి రోడ్ల మీదకి తెచ్చాడని ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో ఆటో డ్రైవర్ల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని.. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. మీకు అండగా ఉంటామని భరోసా కల్పించారు.