ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకు ఊరట

ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకు ఊరట

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, మాజీ డీసీపీ రాధాకిషన్ రావులకు ఊరట లభించింది.పంజాగుట్ట పీఎస్ లో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తుపై హైకోర్టు స్టే విధించింది.తదుపరి విచారణ చేపట్టేవరకు ఈ స్టే అమలులో ఉంటుంది. 

తన ఫోన్ను ట్యాపింగ్ చేశారంటూ చక్రధర్గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాజీ మంత్రి హరీశ్ రావు, మాజీ డీసీపీ రాధాకిషన్‌రావులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పంజాగుట్ట పోలీసులు. ఈ కేసులో హరీష్ రావు వద్ద గతంలో పనిచేసిన కంప్యూటర్ ఆపరేటర్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. 

పంజాగుట్ట పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్‌ చేయాలంటూ పిటీషన్‌ దాఖలు చేసిన హరీశ్ రావు, రాధాకిషన్‌ రావులను ఆదేశించింది హైకోర్టు. గత విచారణ సందర్భంగా హరీష్‌ రావు, రాధాకిషన్‌ రావులను అరెస్ట్ చేయొద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 

 ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించడానికి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూద్రా వస్తారని తెలిపిన పీపీ.. సుప్రీంకోర్టులో వేరే కేసులో బిజీగా ఉన్నందున వాదనలు వినిపించడానికి సమయం కావాలని కోరారు. దీంతో తదుపరి విచారణను మార్చి 3కు వాయిదా వేసింది హైకోర్టు.