![48 గంటలు కాదు.. 48 రోజులైనా వరి బోనస్ పడుతలేదు: హరీశ్ రావు](https://static.v6velugu.com/uploads/2025/02/harish-rao-hits-out-congress-govt-paddy-bonus_ZxruQNW1At.jpg)
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దగా చేస్తుందన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. వరి బోనస్ కాదు..బోగస్ అని..ఇంకా 400 కోట్ల పెండింగ్ లో ఉన్నాయన్నారు. 48 గంటలు కాదు.. 48 రోజులైనా రైతులకు బోనస్ పడటం లేదన్నారు. ఉత్తమ్ మాటలు ..ఉత్తర కుమార మాటలేనని విమర్శించారు.
రైతు బంధు పడుతది.. ఫోన్ లు టింగ్ టింగ్ అంటాయని.. గొప్పలు చెప్పిన రేవంత్ రెడ్డి ఇంకా ఎందుకు వేయడం లేదని ప్రశ్నించారు హరీశ్ రావు. ఎకరానికి 15 వేల రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్, కాంగ్రెస్ పాలన చూసి అధికారులు తలలు పట్టుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ ఎన్నికలు వస్తాయని రైతులు, ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. గ్రామంలో కాంగ్రెస్ నాయకులు తిరిగే పరిస్థితి లేదన్నారు హరీశ్ రావు.
ALSO READ | దక్షిణాది ఏకం కావాలి.. రాజ్యాంగ హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలి..
కాంగ్రెస్ ప్రభుత్వం కోతల ప్రభుత్వం అని విమర్శించారు హరీశ్ రావు. రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల ఎకరాల్లో కందులు పండిస్తే, అధికారులు నిర్లక్ష్యం కారణంగా 2,3 లక్షల ఎకరాల ఆన్ లైన్ లో ఎక్కించలేదన్నారు. ఆన్ లైన్ లో నమోదు కానీ రైతుల కందులు కొనాలని డిమాండ్ చేశారు. రూ. 7,280 సన్ ఫ్లవర్ కు మద్దతు ధర ఉంటే ఇప్పటికీ ప్రభుత్వ కొనుగోలు చేయక పోవడంతో రైతులు బయట మార్కెట్ లో అమ్ముకుని నష్టపోతున్నారని విమర్శించారు.