కోతలు, ఎగవేతలే మిగిలాయి : హరీశ్‌‌రావు

కోతలు, ఎగవేతలే మిగిలాయి : హరీశ్‌‌రావు
  • మాజీ మంత్రి హరీశ్‌‌రావు

సిద్దిపేట, వెలుగు: కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజలు, రైతులకు కోతలు, ఎగవేతలే తప్ప పరిపాలనపై పట్టు సాధించలేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. ఆదివారం సిద్దిపేట క్యాంపు ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు.  బీఆర్ఎస్​ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకలను బంద్ చేసి ఆరు గ్యారంటీలు అటకెక్కించారని విమర్శించారు. పదేళ్లలో పరుగులు పెట్టిన సిద్దిపేట నియోజకవర్గం ఏడాది  కాలంలోనే  ఏడారిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రగతి పరుగులు పెట్టిన చోట నేడు అన్ని పనులు ఆగిపోయాయన్నారు. 

గత  ప్రభుత్వంలో మంజూరైన పనులు రద్దు చేయడం, మధ్యలో ఆపడం కక్ష సాధించడమేనన్నారు. ఏడాది  కాలంలో సిద్దిపేటకు ఏం చేశారో కాంగ్రెస్ నాయకులు చెప్పాలని,  రద్దు చేసిన పనులపై వైఖరి ఏంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వివిధ సంఘాల క్యాలెండర్లను ఆవిష్కరించి, ఇటీవల మృతి చెందిన కుటుంబాలను పరామర్శించారు.-