
- బీజేపీ, కాంగ్రెస్రాష్ట్రానికి శాపంగా మారినయ్: మంత్రి హరీశ్ రావు
సిద్దిపేట: బీజేపీ, కాంగ్రెస్‌పార్టీల తీరుపై మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ఆంధ్రోళ్లతో కలిసి వారు తెలంగాణను ఆగం చేస్తున్నారని విరుచుపడ్డారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం శ్రీగిరిపల్లిలో గ్రామ పంచాయతీ నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ ‘ రైతు వ్యతిరేక చట్టాలు, వేలాది మంది రైతుల చావుకు బీజేపీ కారణమైంది. మూడు గంటల కరెంట్ చాలని తెలంగాణ ప్రజల శాపంగా కాంగ్రెస్ పార్టీ మారింది. ఓవైపు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమైక్యవాదుల మాటలు వింటున్నారు.
వీరిద్దరితో మన బతుకులు ఆగమైతయ్. మాజీ సీఎంలైన చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి ద్రోహులను అడ్డు పెట్టుకుని తెలంగాణ ఆత్మగౌరవాన్ని కుదువ బెట్టే ప్రయత్నం చేస్తున్నరు. -అప్పుడు రాష్ట్ర ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయాలనుకున్నరు. ఇప్పుడిప్పుడే పచ్చబడుతున్న రైతుల జీవితాల్లో కరెంటు కల్లోలం రేపారు. -ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మూడు గంటల కరెంట్అన్నోళ్లు.. రేపు పొరపాటున అధికారమిస్తే తన వాదనను రైతులు బలపరిచారని మూడు నిమిషాలు కూడా ఇవ్వడేమో. --శాపం లాంటి బీజేపీ, పాపం చేసే కాంగ్రెస్ తెలంగాణకు అవసరమా? ఎవరూ ప్రజా సంక్షేమంపై ముందు చూపుతో వ్యవహరిస్తున్నారో.. ప్రజలు మీరే ఆలోచన చేయాలి’ మంత్రి హరీశ్ రావు సూచించారు.