క్రిటికల్ కేర్ సెంటర్ కు శంకుస్థాప చేసిన మంత్రి హరీశ్‌

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లాలో వచ్చే విద్యా సంవత్సరంలో మెడికల్ కాలేజీ ప్రారంభించనున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. బుధవారం కామారెడ్డిలో రూ.23.75 కోట్లతో నిర్మించే క్రిటికల్ కేర్ సెంటర్ బిల్డింగ్ నిర్మాణానికి మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రులు పక్కనే జరుగుతున్న ఎంసీహెచ్​ బిల్డింగ్ నిర్మాణ పనులను పరిశీలించారు. సాధ్యమైనంత త్వరగా కంప్లీట్ చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు. ఎంసీహెచ్, క్రిటికల్​కేర్ యూనిట్ బిల్డింగ్‌లను త్వరగా కంప్లీట్ చేస్తే వచ్చే ఏడాది ప్రారంభం కానున్న మెడికల్ కాలేజీ  కోసం టెంపరరీగా ఉపయోగించుకొవచ్చన్నారు. 

మెడికల్ కాలేజీ కోసం 350 బెడ్స్ ఏర్పాటు చేయాలన్నారు. ఏడాదిలోగా మెడికల్ కాలేజీ బిల్డింగ్ పనులు కంప్లీట్ చేయించాలన్నారు. ఆయా ఆంశాలపై ఆఫీసర్లతో మంత్రి హరిశ్‌రావు చర్చించారు. ప్రతి జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రభుత్వ విప్​గంప గోవర్ధన్, ఎమ్మెల్యేలు హన్మంతు షిండే, సురేందర్, ఉర్దూ అకాడమీ చైర్మన్ ఎం.కె ముజీబుద్దీన్, ప్యామిలీ ప్లానింగ్ కమిషనర్ శ్వేత,  కలెక్టర్ జితేష్ వి పాటిల్, వైద్య, విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్​కుమార్, డీసీహెచ్‌వో విజయలక్ష్మి,డీఎంహెచ్‌వో లక్ష్మణ్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.  అంతకుముందు  ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాలు మంత్రికి అందించారు. దోమకొండలో 100 బెడ్స్​  హాస్పిటల్ ఏర్పాటు చేయాలని విన్నవించారు.