ప్రాజెక్టులకు అనుమతుల ఆలస్యంతో రాష్ట్ర ప్రయోజనాలకు దెబ్బ: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి హరీశ్‌‌‌‌ రావు లేఖ

ప్రాజెక్టులకు అనుమతుల ఆలస్యంతో రాష్ట్ర ప్రయోజనాలకు దెబ్బ: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి హరీశ్‌‌‌‌ రావు లేఖ
  • గోదావరి జలాల్లో తెలంగాణ వాటాలను కాపాడండి

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు ఆలస్యం అవుతుండడంతో రాష్ట్రానికి నష్టం జరుగుతున్నదని బీఆర్‌‌‌‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. 200 టీఎంసీల గోదావరి జలాలను పెన్నా బేసిన్‌‌‌‌కు తరలించేందుకు ఏపీ చేపడుతున్న గోదావరి- బనకచర్ల ప్రాజెక్టు వల్ల రాష్ట్ర సాగు నీటి ప్రయోజనాలు దెబ్బతింటాయన్నారు. ప్రాజెక్టులకు విభజన చట్టం ప్రకారం గోదావరి, -కృష్ణా బోర్డుల అనుమతులు తప్పనిసరి అయినా.. అనుమతులు లేకుండా ఏపీ ఆ ప్రాజెక్టును చేపడుతున్నదని తెలిపారు. ఈ మేరకు సోమవారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఆయన లేఖ రాశారు.‌‌‌‌

ఏపీ సీఎం‌‌‌‌ చంద్రబాబు ఈ ప్రాజెక్టుకు నిధుల కోసం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌‌‌‌, కేంద్ర జల శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌‌‌‌కు లేఖలు రాయడం ఆందోళన‌‌‌‌ కలిగిస్తున్నదన్నారు. మరోవైపు, కాళేశ్వరం ప్రాజెక్టుకు రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోసే ప్రణాళికల అనుమతులు ఇంకా పెండింగ్‌‌‌‌లోనే ఉండడం ఆలోచించాల్సిన విషయమన్నారు. గోదావరి జలాల్లో తెలంగాణకు కేటాయించిన నీటి వాటాలను కాపాడేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డిని డిమాండ్ చేశారు.

ప్రజలను ఎన్నిసార్లు మోసం చేస్తరు

‘‘మాటతప్పడం.. మడమ తిప్పడమే కాంగ్రెస్​ మార్కు పాలన. ఇంకెన్నిసార్లు రేవంత్​రెడ్డి మాట తప్పుతారు’’ అని హరీశ్​ విమర్శించారు. పథకాల అమ లుకు సంబంధించి ప్రజలను ఎన్నిసార్లు మోసం చేస్తారని  సోమవారం ట్విట్టర్​లో ఆయన ప్రశ్నించారు. ‘‘తొలుత 2023 డిసెంబర్​ 9న రుణమాఫీ చేస్తామన్నారు. 

ఆ తర్వాత 2024 ఆగస్టు 15 వరకు అన్నారు. మళ్లీ దసరాకు పూర్తి చేస్తామన్నారు.  ఇప్పటికీ 20 లక్షల మందికిపైగా రైతులకు రుణమాఫీ జరగలేదు.  రైతుబంధును 2023 డిసెంబర్​ 9 తర్వాత రూ.15 వేలు ఇస్తామన్నారు. కానీ, వానాకాలం రైతుభరోసా ఎగ్గొట్టారు’’అని హరీశ్​ విమర్శించారు.