
హైదరాబాద్: అసెంబ్లీలో గతేడాది గవర్నర్ ప్రసంగానికి.. ఈ సారి గవర్నర్ ప్రసంగానికి తేడా ఏం లేదని.. గవర్నర్లు మారడం తప్ప.. ప్రసంగాలు మారలేదని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. చేయనివి చేసినట్లు, ఇవ్వని ఇచ్చినట్లుగా అబద్ధాలు, అవాస్తవాలతో కూడిన ప్రసంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్‌తో చెప్పించిందన్నారు. ‘గవర్నర్ ప్రసంగం మొత్తం అర్థ సత్యాలు, అబద్ధాలు, అవాస్తవాలు. ఏడాదిన్నర ప్రభుత్వ పాలనా వైఫల్యానికి గవర్నర్ ప్రసంగం నిదర్శనం.
రేవంతు అబద్దాల ప్రచారాన్ని నమ్మించేందుకు గవర్నర్‌ను వాడుకోవడం సిగ్గుచేటు. గవర్నర్ మహాత్మా గాంధీ చెప్పిన మాటలతో 32 పేజీల ప్రసంగం మొదలు పెట్టారు. నిజానికి రేవంత్ రెడ్డి అత్యుత్తమ మార్గం ఢిల్లీ, చంద్రబాబు సేవలో నిమగ్నం అయ్యాడని తెలంగాణ ప్రజలు భావిస్తున్నరు. సీఎం స్తుతి, అసత్యాలు తప్ప కొత్తగా ఏం లేదు’ అని సిద్ధిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా విమర్శించారు.
Also Read:-రాష్ట్ర ఆదాయం 18 వేల కోట్లు.. ఖర్చులు 22 వేల కోట్లు ..