అసెంబ్లీలో సీఎం రేవంత్​ రెడ్డితో హరీశ్​రావు భేటీ

అసెంబ్లీలో సీఎం రేవంత్​ రెడ్డితో హరీశ్​రావు భేటీ

హైదరాబాద్, వెలుగు:  సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు, సికింద్రాబాద్​ ఎమ్మెల్యే పద్మారావు  సీఎం రేవంత్‌ రెడ్డిని శుక్రవారం అసెంబ్లీలో కలిశారు. అలాగే, మాజీ మంత్రి మల్లారెడ్డి కుటుంబ సమేతంగా సీఎం రేవంత్‌ను కలిశారు. మెడికల్ కళాశాల సీట్ల పెంపు కోసం సీఎంను కలిసినట్టు మర్రి రాజశేఖర్​రెడ్డి చెప్పారు. ఈ భేటీ అనంతరం మీడియాతో హరీశ్​రావు మాట్లాడారు. సీతాఫల్‌మండి జూనియర్, డిగ్రీ కళాశాల విషయంలో పద్మారావుతో కలిసి సీఎం రేవంత్‌ను కలిశానని చెప్పారు.

గతంలో కేసీఆర్ సీతాఫల్‌మండి కళాశాలకు రూ.32 కోట్లు కేటాయించారని గుర్తుచేశారు. ఆ పనులను రేవంత్ ప్రభుత్వం ఆపేసిందని చెప్పారు. కాగా..రేవంత్​రెడ్డి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత హరీశ్​రావు మొదటిసారి ఆయనను కలిశారు.