రిమాండ్‌లో ఉన్న నరేందర్ రెడ్డికి హరీష్ రావు ములాఖాత్

వికారాబాద్ జిల్లా ప్రభుత్వ అధికారులపై దాడి కేసులో అరెస్ట్ అయిన నరేందర్ రెడ్డిని బీఆర్ఎస్ నేత హరీష్ రావు గురువారం కలిశారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి 14 రోజుల రిమాండ్ కోసం బుధవారం చెర్లపల్లి జైలుకు తరలించారు. నిన్న ఉయదం హైదరాబాద్ లో ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. 

Also Read :- లగచర్ల ఘటన వెనుక కుట్ర ఉంటే.. అది తెలంగాణకే ప్రమాదం

అనంతరం కోర్టులో హాజరుపరిచారు. చర్లపల్లి జైలులో ఉన్న పట్నం నరేందర్ రెడ్డి కలిసేందుకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు, బీఆర్ఎస్ ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చర్లపల్లి జైలుకు చేరుకుని ములాఖాత్ తీసుకున్నారు.