తీహార్ జైల్లో కవితతో హరీశ్ రావు ములాఖత్

తీహార్ జైల్లో కవితతో హరీశ్ రావు ములాఖత్

ఢిల్లీ: ఎమ్మెల్సీ కవితతో మాజీ మంత్రి హరీశ్ రావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ములాఖత్ అయ్యారు. తీహార్ జైల్లో ఆమెను కలిసి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. కాగా.. నిన్న జైలులో అస్వస్థతకు గురైన కవితకు ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే.  ఈనెల  27న  లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.