హరీశ్ అలెర్ట్ : కాళేశ్వరం కేసులో బిగుస్తున్న ఉచ్చు

హైదరాబాద్: మాజీ నీటి పారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అటెన్షన్ అయ్యారు. కాళేశ్వరం కమిషన్ విచారణలో పలుమార్లు హరీశ్ రావు పేరు ప్రస్తావనకు వచ్చింది. అఫిడవిట్ల సమర్పించిన అధికారులు, ఇంజినీర్లు, అప్పటి సీఎం కేసీఆర్, ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు పేర్లను ప్రస్తావించారు. అయితే హరీశ్ రావు ఆదేశాల మేరకే  చేశామంటూ చీఫ్ ఇంజినీర్ సుధాకర్ రెడ్డి కమిషన్ కు వివరించడంతో పాటు అఫిడవిట్  ను సైతం ఇచ్చారు. తన విచారణ సందర్భంగా సుధాకర్ రెడ్డి మూడు సార్లు హరీశ్ రావు పేరును ప్రస్తావించారు. దీంతో తనను కూడా విచారణకు పిలుస్తారని హరీశ్ రావు ఫిక్సయినట్టు తెలుస్తోంది. అందుకే గత మూడు రోజులుగా ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఇరిగేషన్ ఇంజినీర్లు, రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్లు, గతంలో విచారణకు హాజరైన వారితో మంతనాలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది. 

ALSO READ | కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ చెల్లదు: హైకోర్టు

కమిషన్ ఏం ప్రశ్నలు అడుగుతోంది...? దేనిపై ఎక్కువగా ఫోకస్ చేసింది..? తనను విచారణకు పిలిస్తే ఏం సమాధానం చెప్పాలన్న అంశంపై ప్రిపేర్ అవుతున్నారని సమాచారం. తన విచారణ తర్వాతే మాజీ సీఎం కేసీఆర్ ఎంక్వైరీ ఉంటుందని సన్నిహితులతో కేసీఆర్ చెబుతున్నట్టు సమాచారం. ముఖ్యంగా హరీశ్  రావు మంత్రిగా ఉన్న సమయంలోనే కాళేశ్వరం  ప్రాజెక్టుకు బీజం పడింది. ఒప్పందాలు, కాంట్రాక్టులు అన్నీ ఆయన హయాంలోనే జరిగాయి. ఇందులో హరీశ్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని భావించిన కేసీఆర్  ఆయనను మంత్రిపదవి నుంచ తప్పించారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ అంశాన్ని కూడా కమిషన్ ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇలాంటి వాటికి తానెలా  సమాధానం చెప్పాలనే అంశంపై ఆయన పూర్తి స్థాయిలో ప్రిపేర్ అవుతున్నట్టు సమాచారం.