బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ పై హరీశ్ రావు స్పందించారు. ఈ అరెస్ట్ అప్రజాస్వామ్యమని హరీశ్ రావు ఖండించారు. అరెస్టులు మమ్మల్ని ఏం చేయలేవని, కవితది అక్రమ అరెస్ట్ అని అని మండిపడ్డారు. ఇది బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కుట్రని, ఈ కుట్ర కొత్తదేం కాదని ఆయన ఆరోపించారు. మాది ఉద్యమ పార్టీ.. కేసులకు, అరెస్టులకు భయపడమని హరీశ్ రావు స్పష్టం చేశారు. నియోజకవర్గాల కేంద్రాల్లో రేపు నిరసన కార్యక్రమం చేపట్టాలని బీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సుప్రీం కోర్టులో కేసు పెండింగ్ లో ఉండగా.. ఎన్నికల ముందు రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయాలనే ఈ కుట్రకు పాల్పడ్డారని తెలిపారు.
రాజకీయ దురుద్దేశంతోనే ఈ చర్యకు పాల్పడ్డారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయ లబ్ది పొందాలనే ఈ అరెస్ట్ కు పూనుకున్నారని విమర్శించారు. అరెస్ట్ పై సుప్రీం కోర్టులో పిటీషన్ వేస్తామని, న్యాయస్తానంలో పోరాడతామని హరీష్ రావు తెలిపారు.