పోలీసుల ఆత్మహత్యలు కలవరపెడుతున్నయ్​ : ఎమ్మెల్యే హరీశ్ రావు

హైదరాబాద్, వెలుగు: ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన పోలీసులే వరుసగా ప్రాణాలు తీసుకుంటుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నదని బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ములుగు జిల్లాలో ఎస్సై, సిద్దిపేటలో కానిస్టేబుల్ కుటుంబం, కామారెడ్డిలో ఎస్సై, కానిస్టేబుల్, సిరిసిల్లలో కానిస్టేబుల్, మెదక్ కుల్చారంలో హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డారని, ఇటీవల వరుసగా ఈ ఘటనలు జరగడం బాధాకరమని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 

శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసుల జీవితాలకే రక్షణ కరువైందన్నారు. పని ఒత్తిడి, పెండింగ్ హామీలను అమలు చేయడంలో ప్రభుత్వ నిర్లక్ష వైఖరి.. పోలీసులపై ప్రభావం చూపిస్తున్నదన్నారు. ఈ ఆత్మహత్యలపై వాస్తవాలను వెలుగులోకి తెచ్చేందుకు శాఖాపరమైన దర్యాప్తు చేయాలని డీజీపీని డిమాండ్ చేశారు. పోలీసులు ఆత్మహత్య చేసుకోకుండా సైకాలజిస్టులతో కౌన్సిలింగ్ ఇప్పించాలని సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కోరారు. సమస్యలు ఏవైనా ఆత్మహత్య మంచిదికాదని, కష్టపడి ఉద్యోగాలు సాధించారని, కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయొద్దని పోలీసులను కోరారు.