జర్నలిస్టులకు ప్రభుత్వం ఇచ్చే దసరా కానుక ఇదేనా..? హరీష్ రావు

జర్నలిస్టులకు ప్రభుత్వం ఇచ్చే దసరా కానుక ఇదేనా..? హరీష్ రావు

హైదరాబాద్: జర్నలిస్టులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఇండ్ల స్థలాలను కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం శోచనీయమని బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా హరీష్ రావు రియాక్ట్ అయ్యారు. ‘‘బీఆర్ఎస్ ప్రభుత్వం కరీంనగర్‎లో 118 మంది జర్నలిస్టులకు కేటాయించిన ఇండ్ల స్థలాలను కాంగ్రెస్ సర్కార్ వెనక్కి తీసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం’’ అని పేర్కొన్నారు. జర్నలిస్టులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే దసరా కానుక ఇదేనా అని ప్రశ్నించారు. 

ALSO READ | వ్యక్తిగత అజెండా లేదు.. లేక్స్‎ను కాపాడటమే లక్ష్యం: డిప్యూటీ CM భట్టి

రాజకీయ కక్షలో భాగంగా బతుకమ్మ, దసరా పండుగల వేళ జర్నలిస్టుల కుటుంబాల్లో ఆవేదన మిగిల్చడం శోచనీయమన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిత్యం శ్రమించే జర్నలిస్టుల పట్ల కాంగ్రెస్ వ్యవహరిస్తున్న దుర్మార్గ వైఖరికి ఇది మరో నిదర్శనమని ప్రభుత్వాన్ని విమర్శించారు. జర్నలిస్టులకు, వారి కుటుంబాలకు అన్యాయం చేయవద్దని కోరిన హరీష్ రావు.. వెంటనే జర్నలిస్టుల ఇళ్ల స్థలాల రద్దు ప్రకటనను ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.