దేశంలో అత్యధిక మందికి పోడు పట్టాలు ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ : హరీష్ రావు

దేశంలో అత్యధిక మందికి  పోడు పట్టాలు ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ అని మంత్రి హరీష్ రావు అన్నారు.  ఈ పోడు పట్టాలు వలన గిరిజనలకు పది రకాల ప్రయోజనాలు కలుగుతాయని చెప్పారు. ఈ పట్టాలకు మీరు ఓనర్లు, మీమల్ని ఎవరూ ఇబ్బంది పెట్టరన్నారు.  పోడు భూములకు రైతు బంధు, రైతు చనిపోతే 5 లక్షల రూపాయల వరకు బీమా కూడా ఇస్తున్నామని వెల్లడించారు. గతంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు గిరిజనులను ఓటు బ్యాంకులుగానే చూశాయని ఆరోపించారు.  

తెలంగాణలో అమలు అవుతోన్న పథకాలను కేంద్రం కాపీ కొట్టిందని హరీష్ రావు అన్నారు.  తాము పనిచేయకపోతే తమ పథకాలను ఎందుకు కాపీ కొడతున్నారని ప్రశ్నించారు. తెలంగాణకు భారీగా పెట్టుబడులు వస్తున్నాయని మోడీ అంటున్నారంటే అదంతా కేసీఆర్ గొప్పతనమని వెల్లడించారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు రాష్ట్రానికి వస్తే కేసీఆర్ ను తిట్టడం తప్ప రాష్ట్రానికి చేసిదేమీ లేదని విమర్శించారు. గల్లీలో తిట్టి ... ఢిల్లీలో రాష్ట్రానికి అవార్డులు ఇస్తున్నారని తెలిపారు.  

మీకు ఈడీ, సీబీఐలు అండగా ఉంటే తమకు తెలంగాణ ప్రజలు అండగా ఉన్నారని చెప్పుకొచ్చారు.  తెలంగాణకు చాలా నిధులు ఇచ్చామని మోదీ అంటున్నారు..  కానీ రావాల్సిన నిధులను ఆపేశారని హరీష్ రావు ఆరోపించారు.  నీతి అయోగ్ చెప్పినా డబ్బులు ఇవ్వలేదన్నారు.  తెలంగాణ అభివృద్ధిని మోదీ ప్రభుత్వం అడ్డుకుంటుందన్నారు.  తెలంగాణకు కోచ్ ఫ్యాక్టరీ కావాలని అడిగితే..   వ్యాగన్ యూనిట్ ఇచ్చారని అన్నారు హరీష్.