లక్ష కేసులు పెట్టినా ప్రశ్నించడం ఆపను : బీఆర్ఎస్​ ఎమ్మెల్యే హరీశ్​రావు

హైదరాబాద్, వెలుగు : సీఎం రేవంత్ ​రెడ్డి లక్ష కేసులు పెట్టించినా ప్రజల తరఫున ప్రశ్నించడం ఆపనని బీఆర్ఎస్​ఎమ్మెల్యే హరీశ్​రావు అన్నారు. పంజాగుట్ట పీఎస్ లో ఆయనపై కేసు నమోదు కావడంతో మంగళవారం ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. సీఎం రేవంత్​కు చేతనైంది ఒక్కటేనని, తప్పు చేసి దబాయించి.. కేసులు పెట్టడడమేనని విమర్శించారు.

‘అడుగడుగునా నువ్వు చేస్తున్న అన్యాయాలను నిలదీస్తున్నందుకు, నీ నిజ స్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నందుకు నాపై అక్రమ కేసులు పెడుతున్నవ్.  నీ రెండు నాల్కల వైఖరిని బట్టబయలు చేసినందుకు, ప్రజాక్షేత్రంలో నిలదీసినందుకు తట్టుకోలేక  పంజాగుట్ట స్టేషన్ లో తప్పుడు కేసు పెట్టించినవ్. ప్రజా కోర్టులో, ప్రజా తీర్పుతో నీకు తగిన శిక్ష పడేంత వరకు ఆగను’’ అని హరీశ్​రావు పేర్కొన్నారు.