
మెదక్ లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ పక్కా అని.. తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని మంత్రి హరీశ్ రావు అన్నారు. వస్తుందన్నారు. పాపన్నపేట మండలంలో మంత్రి హరిశ్ రావు సమక్షంలో మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్బంగా మాట్లాడిన హరీశ్ రావు.. శశిధర్ రెడ్డి మెదక్ ప్రాంతంలో ఎనలేని సేవలు చేశారని అన్నారు. ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మెదక్ అభివృద్ధికి ఎంతో కృషి చేసిందన్నారు. వ్యవసాయం దండగ అన్న దానిని పండుగ చేసింది కేసీఆరేనని చెప్పారు. రైతుల సంక్షేమం కోసం బీఆర్ఎస్ అనేక పథకాలు ప్రవేశపెడుతోందన్నారు.
సీఎం కేసీఆర్ పథకాలు దేశానికి ఆదర్శమన్నారు మంత్రి హరీశ్ రావు. తెలంగాణ పథకాలను చూసి దేశానికి ఆదర్శమని చెప్పారు. మన పథకాలను ఇతర రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరోసారి ఆదరించాలని చెప్పారు. శశిధర్ రెడ్డి,తిరుపతి రెడ్డి లు మెదక్ అభివృద్ధి లో భాగస్వాములు కావడం సంతోషంగా ఉందన్నారు. డబ్బులతో మెదక్ లో గెలువలేరని..పద్మ గెలుపు మెదక్ అభివృద్ధికి నాంది అని అన్నారు.