
సీఎం రేవంత్ రెడ్డిపై మాజీమంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. కేసీఆర్ కు రేవంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ 14 ఏళ్లు పోరాడి తెలంగాణ సాధించి రాష్ట్రానికి దశ దిశ చూపారన్నారు. రేవంత్ మాటలతో రాష్ట్ర పరువు పోయిందన్నారు. స్టేషర్ విషయంలో రేవంత్ మాట మార్చారని ఫైర్ అయ్యారు. రేవంత్ బట్టకాల్చి మీద వేస్తున్నారని చెప్పారు.
రేవంత్ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారంటూ ధ్వజమెత్తారు హరీశ్. రేవంత్ ప్రభుత్వం అబద్దాలతో నడుస్తోంది..రేవంత్ అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారారని మండిపడ్డారు హరీశ్. ప్రాస కోసం రేవంత్ దివాళా రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ తెలంగాణ జాతిపితగా పేరు సంపాదిస్తే..రేవంత్ బూతుపితగా పేరు తెచ్చుకున్నారని ఫైర్ అయ్యారు హరీశ్ .
Also Read : నాగర్ కర్నూల్ జిల్లాలోని పురాతన జామా మసీదుకు రూ.50 లక్షలు
ఉచితంగా ఎల్ఆర్ఎస్ అమలు చేస్తామన్న ఎన్నికల హామీ ఏమైందని ప్రశ్నించారు హరీశ్. రేవంత్ ఫార్మాసిటీని ఫోర్త్ సిటీగా మార్చారని మండిపడ్డారు.రేవంత్ బీజేపీ మనిషి..మోదీ రేవంత్ ఇద్దరూ దోస్తులేనని విమర్శించారు.గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను బండకేసి కొట్టారు..మేధావులు,గ్రాడ్యుయేట్లు కాంగ్రెస్ వ్యతిరేకతను ఎండగట్టారన్నారు . కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడు కాబట్టే కృష్ణాలో 70 శాతం వాటా రావడానికి మార్గం సుగుమైందన్నారు.జగదీష్ రెడ్డి తప్పులేకున్నా సభ నుంచి సస్పెండ్ చేశారని ధ్వజమెత్తారు హరీశ్.