సిద్దిపేట దేశానికే ఆదర్శం: హరీశ్ రావు

సిద్దిపేట దేశానికే ఆదర్శం: హరీశ్ రావు

సిద్దిపేట అన్ని రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు.  దక్షిణ భారత దేశంలో సిద్దిపేటకు క్లిన్ సిటీగా స్వచ్ఛ అవార్డు వచ్చిందని చెప్పారు.  చరిత్ర పుటల్లో సిద్దిపేట ఒక అధ్యాయంగా మారుతుందన్నారు. అమర్ నాథ్ సేవా సమితి వారు  అమర్ నాథ్ లో 11వ సారి అమర్ నాథ్, కేదార్ నాథ్ లో సేవ చేయడం అదృష్టమన్నారు.  అన్ని దానాల్లో అన్నదానం చాలా గొప్పదన్నారు.  అన్నదానాల్లో సిద్దిపేటకు పెట్టింది పేరన్నారు హరీశ్ రావు. సిద్దిపేటలో కొన్ని దేవాలయాల్లో నిత్య అన్నదానం చేస్తున్నామని చెప్పారు. క్యాంపు కార్యాలయంలో  తాను కూడా రోజు అన్నదానం చేస్తానని చెప్పారు.  

చాగంటి, గరికపాటి వంటి వారి ప్రవచనాలతో భక్తి భావం పెరిగిందన్నారు హరీశ్ రావు. హిందు ధర్మం పరిరక్షణ కోసం భక్తులు ఉన్నారని.. మానవసేవే మాధవ సేవ అని చెప్పారు. పట్టాభిరాముడికి సేవ చేయడం లాంటి ఒక గొప్ప కార్యక్రమం అయోధ్యలో చేస్తున్నామని చెప్పారు.  సిద్దిపేటలో అమర్నాథ్ అన్నదానసేవా సమితికి శాశ్వత భవనం నిర్మిస్తామన్నారు.