హైదరాబాద్ కోకాపేటలోని తన నివాసంలో మాజీ మంత్రి హరీష్ రావును హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. హరీష్ రావు నివాసం ముందు భారీగా పోలీసుల మొహరించారు. ఎవరిని లోనికి అనుమతించడం లేదు పోలీసులు. అయితే తన ఇంటి నుంచి బయటకు వెళ్తున్న హరీశ్ ను పోలీసులు అడ్డుకున్నారు. తన భుజానికి గాయం అయ్యిందని ఆస్పత్రికి వెళ్ళాలని పోలీసులతో చెప్పారు హరీశ్.. ఆస్పత్రికి వెళ్లకుండా అడ్డుకోవడంతో తనను మీరే ఆస్పత్రికి తీసుకెళ్ళాలని పోలీసులకు చెప్పారు హరీశ్.
దీంతో పోలీసులు హరీశ్ రావును గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. హరీశ్ భుజానికి వైద్య పరీక్షలు చేశారు డాక్టర్లు. సెప్టెంబర్ 12న కేశంపేట పీఎస్ కు హరీశ్ రావును తరలిస్తుండగా తన భుజానికి స్వల్ప గాయం అయ్యింది.
Also Read:-బోయిన్ పల్లిలో మల్లారెడ్డి హౌస్ అరెస్ట్