ఓఆర్​ఆర్​పై హరీశ్​ వర్సెస్​ పొంగులేటి

ఓఆర్​ఆర్​పై హరీశ్​ వర్సెస్​ పొంగులేటి

హైదరాబాద్​, వెలుగు: సభలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి, బీఆర్ఎస్​ ఎమ్మెల్యే హరీశ్​ రావు మధ్య హాట్​హాట్​గా చర్చ నడిచింది. కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి  మాట్లాడుతుండగా.. హరీశ్​రావు కల్పించుకొని ఓఆర్ఆర్​ అంశాన్ని ప్రస్తావించారు. రాష్ట్రం హుందాతనం గురించి రాజగోపాల్​ రెడ్డి మాట్లాడుతున్నారని, మరి, సీఎం చేసిన వ్యాఖ్యలేంటని ప్రశ్నించారు.

ALSO READ : ఓఆర్ఆర్ టెండర్​పై సిట్..హరీశ్​రావు కోరిక మేరకు విచారణకు ఆదేశిస్తున్నం

 ఓఆర్ఆర్​ టెండర్లను తాను రద్దు చేయమన్నానేగానీ, విచారణ చేయాలని అడగలేదని తెలిపారు. కానీ, సీఎం మాత్రం హరీశ్​ రావు డిమాండ్​ మేరకే సిట్​ ఏర్పాటు చేసి విచారణ చేస్తున్నామని చెప్పడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి కల్పించుకొని.. విచారణ చేయకుండా టెండర్లు ఎలా రద్దు చేస్తారని ప్రశ్నించారు. ఒక్కసారి అగ్రిమెంట్​ అయ్యాక విచారణ జరగకుండా రద్దు చేస్తారా? అని ప్రశ్నించారు.