హైదరాబాద్ : ఢిల్లీలో కాంగ్రెస్ నేత వేణుగోపాల్ రైతు భరోసా పీఏసీ చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని.. అక్కడ ఒక రూల్ .. తెలంగాణలో మరో రూలా? అని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసి 38 రోజులు అవు తున్నా వాటిపై ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో 9 నెలల కాంగ్రెస్ పాలన రైతులకు శాపంగా మారిందని విమర్శించారు. తెలంగాణ భవన్ లో హరీశ్ రావు మాట్లాడుతూ.. రుణమాఫీ కాలేదన్న బాధతోనే దాదాపు 470 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆరో పించారు.
రుణమాఫీ ఎగ్గొట్టేందుకు ప్రభుత్వం 31 సాకులు చూపిస్తుందన్నారు. రైతు భరోసా ఎప్పుడు ఇస్తారో క్లారిటీ లేదని, క్యాబినెట్ సబ్ కమిటీ ఎటుపోయిందో తెలియదన్నారు. ‘గాంధీ హాస్పిటల్లో జరిగిన ఘటనలో పోలీసులను నేను వ్యక్తి గతంగా ఏమి అనలేదు. ప్రభుత్వా న్ని తప్పుపట్టాను. కొత్త డీజీపీ వచ్చాకా 9 మత కలహాలు జరిగాయి. లా అండ్ ఆర్డర్ గాడిలో లేదు. ప్రభుత్వం పీఏసీ, పీయూసీ, ఎస్టిమెం ట్ కమిటీలను అసెంబ్లీలో అనౌన్స్ చేసింది. రాహుల్ గాంధీ చేతిలో రాజ్యాంగం పట్టుకుని తిరుగుతున్నారు. ఆ రాజ్యాంగం తెలంగాణకు వర్తించదా ? అని అన్నారు.