ప్రతిపక్షం నిలదీస్తే గానీ ప్రభుత్వం నిరుపేదల గురించి ఆలోచించదా? అంటూ మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. ప్రజాపాలన దరఖాస్తులకు కూడా రేషన్ కార్డులు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడం బీఆర్ఎస్ విజయమని చెప్పారు. మీ సేవా దరఖాస్తులు కూడా పరిగణనలోకి తీసుకోవాలని, పెరిగిన ద్రవ్యోల్బణం ఆధారంగా రేషన్ కార్డులకు ఆదాయ పరిమితి పెంచాలని డిమాండ్ చేశారు.
తద్వారా ఆశాలు, అంగన్వాడీలు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, జర్నలిస్టులు.. ఇతర అల్ప ఆదాయ వర్గాలు, పేదలు రేషన్ కార్డులు పొందే వీలు ఉంటుందని స్పష్టం చేశారు. దరఖా స్తులు చేసుకోవడం నిరంతర ప్రక్రియ అని చెప్ప డాన్ని స్వాగతిస్తున్నామన్నారు. పథకాల్లో కోతలకే కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.
ALSO READ | హైదరాబాద్లో క్యాపిటల్ ల్యాండ్ భారీ పెట్టుబడి..రూ.450 కోట్లతో కొత్త ఐటీ పార్క్
ప్రజలను మోసం చేయాలని చూసిన ప్రతిసారి, తాము మిమ్మల్ని ప్రశ్నిస్తుంటాం, నిలదీస్తూనే ఉంటామని ట్విట్టర్వేదికగా స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం.. పేదలకు శాపం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, పేద ప్రజలకు శాపంగా మారిందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. పెండింగ్ బకాయిలు విడుదల చేయక పోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిన దుస్థితి నెలకొందన్నారు. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటు న్నా రాష్ట్రానికి పట్టింపు లేకపోవడం దురదృష్టకర మని ఫైర్అయ్యారు. నెట్వర్క్ ఆస్పత్రుల డిమాండ్లు పరిష్కరించి, పెండింగ్ బకాయిలు చెల్లించి ఆరోగ్య శ్రీ సేవలు కొనసాగేలా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.