సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్ర భవిష్యత్ కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని విమర్శించారు మాజీ మంత్రి హరీశ్ రావు. ప్రజాపాలన దినోతవ్సంలో రేవంత్ రెడ్డి అన్ని అబద్ధాలే మాట్లాడారని చెప్పారు.ఆర్థిక సంఘాన్ని తప్పుదోవ పట్టించేందుకు బురద జల్లుతున్నారని విమర్శించారు. 4 వేల పిన్షన్ ఏమయ్యిందని ప్రశ్నించారు.
తెలంగాణ అప్పు రూ 4.26 లక్షల కోట్లు ఉంటే.. రూ.6 .85 లక్షల పైన ఉందని రేవంత్ అబద్దాలు చెబుతున్నారని హరీశ్ రావు చెప్పారు. జై తెలంగాణ అనని వాళ్లు.. అమర వీరుల స్థూపం దగ్గర శ్రద్ధాంజలి ఘటించారని విమర్శించారు. రేవంత్ చిల్లర రాజకీయాలు మాని ప్రజలకు మంచిపాలన అందించాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా రేవంత్ లాగా వ్యవహరించ లేదన్నారు హరీశ్ రావు.