గురుకులాల్లో ఫుడ్​పాయిజన్ ఘటనలపై స్పందించరా? : హరీశ్​రావు

  • ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదు : హరీశ్​రావు

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని గురుకులాల్లో వరుస ఫుడ్​ పాయిజన్​ ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వ తీరు మాత్రం మారడం లేదని మాజీ మంత్రి హరీశ్​ రావు అన్నారు. మంచిర్యాల గిరిజన గురుకులంలో 12 మంది విద్యార్థినులు ఆసుపత్రి పాలైన ఘటన జరిగి ఒక్క రోజు కాకముందే.. 

మరో గురుకులంలో వాంతులు, కడుపునొప్పితో  విద్యార్థులు ఆస్పత్రిలో చేరడం దయనీయమని పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఎక్స్​ లో పోస్ట్​ పెట్టారు. ఇలాంటి కేసులు పునరావృతం కాకుండా చర్యలు  తీసుకోవాలన్నారు.