
సంగారెడ్డి: కాంగ్రెస్పార్టీతోనే రైతుబంధు ఆగిందని మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం ఝారసంగంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రైతుబంధుపై కాంగ్రెస్కుట్రలు చేసింది. ధర్మం గెలిచింది, న్యాయం గెలిచింది అని నేను మాట్లాడితే కాంగ్రెస్ పార్టీకి చెందిన నిరంజన్ ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేశారు. నోటికాడ బుక్కను ఆపింది కాంగ్రెస్.
ఎన్ని రోజులు ఆపుతారు రైతుబంధు.. వచ్చేది మన ప్రభుత్వమే. డిసెంబర్మూడో తేదీ తర్వాత మళ్లీ రైతుబంధు డబ్బులు టింగ్ టింగ్ మని అకౌంట్లో పడతాయి.. మాది ఓటు బంధం కాదు.. మాది పేగు బంధం.. ఓట్ల కోసం మేము రైతు బంధు ఇవ్వలేదు.. ప్రేమతో ఇచ్చినం. రైతుబంధు అడ్డుకున్న కాంగ్రెస్ను జనం ఓటుతోనే కొట్టాలి’ అని పిలుపునిచ్చారు.