తెలంగాణకు రానున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మాజీ మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ ఒక్కసారి అశోక్ నగర్ ను సందర్శించాలంటూ పోస్ట్ పెట్టారు హరీశ్ రావు . ఎన్నికలప్పుడు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీల్లో 10 శాతం కూడా నెరవేర్చలేదన్నారు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని.. ఉద్యోగం లేని జాబ్ క్యాలెండర్ గా చేశారని విమర్శించారు. 10 నెలల్లో నిరుద్యోగ భృతి.. రూ.5లక్షల యువ వికాసం లాంటి పథకాలు ఏమయ్యాయని ప్రశ్నించారు.అశోక్ నగర్ ను కాంగ్రెస్ ప్రభుత్వం శోక్ నగర్ గా ఎలా మార్చిందో... ఒక్కసారి అశోక్ నగర్ వచ్చి నిరుద్యోగులతో మాట్లాడాలని ట్వీట్ చేశారు హరీశ్ రావు.
Also Read :- తిరుమల ఘాట్ రోడ్డులో మందు బాటిళ్లు, సిగరెట్ ప్యాకెట్లు
నవంబర్ 6 నుంచి తెలంగాణలో ప్రారంభించనున్న కులగణనపై ప్రజలు, మేధావులు, వివిధ సామాజిక వర్గాల వారి సలహాలు, సూచనలు స్వీకరించేందుకు రాహుల్ తెలంగాణకు వస్తున్న సంగతి తెలిసిందే.
రాహుల్ పర్యటన షెడ్యూల్ ఇదే..
రాహుల్‌గాంధీ నవంబర్ 5న సాయంత్రం 4.45 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. 5 గంటలకు అక్కడి నుంచి రోడ్డు మార్గం గుండా బయలుదేరి 5.20 గంటలకు బోయిన్ పల్లిలోని గాంధీ ఐడియాలాజీ సెంటర్ కు చేరుకోనున్నారు. సాయంత్రం 5. 30 గంటలకు ప్రారంభం కానున్న సమావేశం సాయంత్రం 6. 30 గంటల వరకు కొనసాగనున్నది. సరిగ్గా గంట పాటు కొనసాగనున్న ఈ మీటింగ్ అనంతరం ఆయన తిరిగి 7. 10 గంటలకు రోడ్డు మార్గం గుండా బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. ఆ తర్వాత రాహుల్ తిరిగి ఢిల్లీకి పయనం కానున్నారు.