సిద్దిపేట, వెలుగు: పదో తరగతి పరీక్ష ఫలితాల్లో సిద్దిపేట జిల్లాను మొదటి స్థానంలో నిలపాలని ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు సూచించారు. శుక్రవారం నియోజకవర్గంలోని పదో తరగతి స్టూడెంట్స్ప్రిపరేషన్ పై డీఈవో, ఎంఈవోలు, హెచ్ఎంలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. పది ఫలితాల్లో ఐదేళ్ల నుంచి సిద్దిపేట అగ్రస్థానంలో నిలుస్తూ రాష్ట్రంలో అన్ని జిల్లాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. ఇదే స్ఫూర్తితో ఈ సంవత్సరం సైతం మంచి ఫలితాలు సాధించడానికి ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. ఇప్పటికే స్టూడెంట్స్తల్లి తండ్రులకు ఉత్తరాలు పంపామని, త్వరలోనే స్కూల్వారీగా సమీక్షా నిర్వహిస్తానని తెలిపారు.
చదువులో వెనుకబడిన స్టూడెంట్స్పై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, స్టూడెంట్స్‌కు స్నాక్స్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. చిన్నకోడూరు మండలం గోపులా పూర్, కస్తూరి పల్లి చెక్ డ్యాం పనులు ప్రారంభించేందుకు అనుమతి లభించిందని, అధికారులు వెంటనే పనులు ప్రారంభించాలని ఆదేశించారు. నారాయణ రావుపేట మండలం గోపులాపూర్ లో రూ.1. 34 కోట్లు, చిన్నకోడూర్ మండలం కస్తూరి పల్లిలో రూ.3.28 కోట్లతో చెక్ డ్యామ్ ల నిర్మాణానికి గత ప్రభుత్వంలో అనుమతులు మంజూరు చేసుకున్నామని, టెండర్లు పూర్తి అయినందున పనులు చేపట్టాలని సూచించారు.