
మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సస్పెన్షన్ పై పున పరిశీలించాలని కోరారు మాజీ మంత్రి హరీశ్ రావు. గవర్నర్ ప్రసంగారినికి అసెంబ్లీలో ధన్యవాదం తీర్మానం చర్చ సందర్బంగా హరీశ్ మాట్లాడారు. జగదీశ్ రెడ్డి దురుద్దేశంతో ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. జగదీష్ ఎక్కాడా ఏక వచనంతో మాట్లాడ లేదన్నారు. స్పీకర్ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పూర్తి మద్దతు ప్రకటించిందని గుర్తు చేశారు. సభా సంప్రదాయాలను పాటించాలని తమ నాయకుడు కేసీఆర్ చెబుతుంటారని అన్నారు.
బీఆర్ఎస్ నేతలకు అసెంబ్లీ, స్పీకర్ అన్నా ఎంతో గౌరవం ఉందన్నారు. జగదీష్ రెడ్డికి మైక్ ఇచ్చి ఉంటే వివరణ ఇచ్చే వారన్నారు.
బంగారు తెలంగాణతో దగా చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ ద్వజమెత్తారు. ప్రశ్నించే వాళ్లను పదేళ్ల పాటు తొక్కిపట్టారని అన్నారు. పదేండ్ల మీ పాలన మీ నమ్మక ద్రోహానికి చిరునామా అని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి పాలించారు. పదేండ్లలో ప్రాజెక్టుులు కడితే సంవత్సరం కాకముందే కూలిపోయాయని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ కన్నీళ్లే మిగిల్చిందన్నారు.
మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిపై బడ్జెట్ సెషన్ ముగిసే వరకు సస్పెన్షన్ వేటు పడిన సంగతి తెలిసిందే. స్పీకర్ చైర్ ను అవమాన పర్చేలా వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రిపై వేటు వేయాలని ప్రతిపాదిస్తూ శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తీర్మానం ప్రవేశపెట్టగా.. సభ ఆమోదంతో స్పీకర్ నిర్ణయాన్ని అమలు చేశారు.