హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి సినిమా వాళ్లను భయపెట్టి మంచిగా చేసుకోవాలని చూస్తున్నారని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. డిసెంబర్ 26న కిమ్స్ లో శ్రీతేజ్ ను పరామర్శిం చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. శ్రీతేజ్ త్వరగా కోలుకోవా లని కోరుకుంటున్నట్టు చెప్పారు. సంధ్య థియేటర్ ఘటనను ప్రభుత్వం రాజకీయం చేస్తోందని ఆరోపించారు.
ALSO READ | నో బెన్ఫిట్ షోలు -టికెట్ల రేట్ల పెంపు...కుండబద్దలు కొట్టిన సీఎం రేవంత్
చట్టం అందరికీ సమానంగా ఉండాలని చెప్పిన సీఎం..తమ్ముళ్ల విషయంలో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు హరీశ్ రావు. తెలంగాణలో ఓ సర్పంచ్ ఆత్మ హత్య చేసుకుని మృతి చెందితే వీటికి కారణమైన సీఎం తమ్ముడిని ఎందుకు అరెస్ట్ చేయలేదన్నారు. గురుకులాల్లో మృతి చెందిన విద్యార్థి కుటుంబాన్ని సీఎం ఎందుకు పరామర్శించలేదన్నారు హరీశ్.