వనపర్తి: ప్రభుత్వ అండతో అక్రమ కేసులు పెడుతూ కొందరు పోలీసులు లిమిట్‌దాటి వ్యవహరిస్తున్నారు. వారి పేర్లు డైరీల్లో రాసిపెడుతున్నామని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మాపై అక్రమ కేసులు పెడితే భయపడేది లేదన్నారు. వనపర్తిలో రైతు ప్రజా నిరసన సదస్సుకు హాజరై హరీశ్‌రావు మాట్లాడారు.. ఇప్పటివరకు 20 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ అయిందన్నారు. రేవంత్‌రెడ్డి వచ్చాక పాత స్కీంలను ఆపేశారన్నారు. రుణమాపీ చేయలేదు. నన్ను రాజీనామా చేయమంటున్నారని ఫైర్అయ్యాడు.
‘ఎనముల రేవంత్ కాదు.. ఎగవేతల రేవంత్. ఢిల్లీకి మూటలు పంపేందుకు.. లక్షా 50 వేల కోట్లతో మూసీ సుందరీకరణకు డబ్బులిచ్చే సీఎంకు రైతులకు రైతుభరోసా ఇచ్చేందుకు నిధులు లేవా..? రైతుబంధు ఇవ్వని కాంగ్రెస్‌ను ఉరికించాలి. పత్తి రైతులకు మద్దతు ధర లేక రైతులు అవస్థలు పడుతున్నారు. వరంగల్డిక్లరేషన్లో అనేక హామీలు ఇచ్చారు. సీఎం వచ్చిన తర్వాత బతుకమ్మ చీరలను ఆపేశారు. డెడ్ లైన్లు మారాయి.. పత్రికల్లో హెడ్ లైన్లు మారాయి.. కాని రైతు రుణమాఫీ మాత్రం ఓ లైన్ రాలేదు.
సర్కార్ దవాఖానాల్లో మందులు కూడా లేవు. 29 జీవోతో నిరుపేద నిరుద్యోగులకు తీవ్ర నష్టం కలుగుతుంది. రాష్ట్రంలో ప్రజాపాలన కాదు. పోలీసు పాలన సాగుతోంది. సీఎంకు పాలన మీద పట్టు లేదు. బీఆర్ఎస్ పోరాటంతోనే కరెంట్ బిల్లులు పెరగలేదు. వచ్చే అసెంబ్లీలో ప్రభుత్వం మెడలు వంచుతాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి’ అని హరీష్ రావు అన్నారు.