- సీఎంకు హరీశ్ లేఖ
హైదరాబాద్, వెలుగు: వరద బాధితులకు సాయం పెంచడంతో పాటు, బాధితులందరికీ తక్షణమే సాయం అందేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్ రావు లేఖ రాశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పలు జిల్లాలు వరద నీటితో నిండిపోయి, జనజీవనం స్తంభించిపోయిందని తెలిపారు. అధికారిక లెక్కల ప్రకారం.. 33 మంది ప్రాణాలు కోల్పోయారని, 5,438 వేల కోట్ల ఆస్తి నష్టం జరిగిందని, 4.25 లక్షల ఎకరాల్లో పంట నష్టం సంభవించిందని చెప్పారు. ఇలాంటి పరిస్థితిలో బాధితులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. తక్షణ సాయం కింద పది వేలు ఇస్తామన్నారని, మంత్రి పొంగులేటి ఈ సాయాన్ని మరో రూ.6,500 కలిపి మొత్తం 16,500లకు పరిమితం చేశారని అన్నారు. సింగరేణి కార్మికుల బోనస్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం బోగస్ చేసిందని, లాభాల వాటాలో 50% కోత పెట్టిందని హరీశ్ రావు మండిపడ్డారు.