డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వలేదని అడ్డగింత

 హైదరాబాద్​:  సిద్దిపేట జిల్లా  గజ్వేల్ లో మాజీ మంత్రి హరీశ్ రావుకు, మెదక్ బీఆర్​ఎస్​ ఎంపీ అభ్యర్థి వెంకట్రాం రెడ్డికి నిరసనసెగ తగిలింది. ఇవాళ ఉదయం గజ్వేల్ లో  జరిగిన బీఆర్ఎస్  పార్లమెంటరీ సన్నాహక సమావేశంలో హరీశ్​ రావు,  వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు.  మీటింగ్ పూర్తయ్యాక బయటకు వస్తుండగా గేటు బయట గజ్వేల్ లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులు అడ్డుకున్నారు.  

తమకు ఇంతవరకు ఇండ్లు ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. ఆర్డీఓతో మాట్లాడి డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇప్పిస్తానని లబ్ధిదారులకు హరీశ్ రావు హామీ ఇచ్చారు. అయితే ఇదివరకే ఇచ్చిన హామీలనే నెరవేర్చలేదని లబ్ధిదారులు అన్నారు.

ALSO READ :- ఏపీలో దారుణం: పెన్షన్ రాలేదని మనస్తాపంతో ఇద్దరు వృద్దులు మృతి..