
బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్స్ పై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని హెచ్చరించారు మాజీ మంత్రి హరీశ్ రావు. హెచ్ సీయూ విషయంలో ప్రభుత్వాన్ని నిలదీసినందుకు విద్యార్థులు, బీఆర్ఎస్ నాయకులు, సోషల్ మీడియా వారియర్స్ పై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. ఇలా ఎంతమందిపై కేసులు పెట్టకుంటూ వెళ్తారని ప్రశ్నించారు హరీశ్ రావు.
ఏప్రిల్ 4న నల్లగొండ జిల్లా, మర్తినేని గూడెం మాజీ సర్పంచ్ బండమీది రామును అక్రమంగా పోలీస్ స్టేషన్ లో నిర్బంధించారు. ఇలా ఎంతమందిపై కేసులు పెట్టుకుంటూ వెళ్తారు రేవంత్ రెడ్డి ? ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా? సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు పెడతారా? ఇదెక్కడి ప్రజాస్వామ్యం? ఇదేం ఇందిరమ్మ రాజ్యం? అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీ పిట్ట బెదిరింపులకు భయపడేది లేదు. రైతులకు, మహిళలకు, విద్యార్థులకు, వృద్ధులకు, దివ్యాంగులకు.. ఇలా అన్ని వర్గాల ప్రజలకు మీరు ఇచ్చిన హామీలను అమలు చేయించేదాకా బిఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టదు. ఎక్కడికక్కడ మిమ్మల్ని నిలదీస్తాం. ప్రజాక్షేత్రంలో మీ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటాం అని హరీశ్ రావు వ్యాఖ్యానించారు.
Also Read:-రాష్ట్ర ప్రగతికి అడ్డు రావొద్దు.. ప్రతిపక్షాలకు మంత్రి శ్రీధర్ బాబు వార్నింగ్