- మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయలేకపోయిన కాంగ్రెస్ నేత
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయడానికి వచ్చిన కాంగ్రెస్ నేత, రాష్ట్ర మాజీ సీఎం హరీశ్ రావత్‌కు షాక్ తగిలింది. ఓటర్ జాబితాలో పేరు లేకపోవడంతో ఆయన ఓటు వేయలేకపోయారు. ఓటరు లిస్ట్ నుంచి ఆయన పేరు గల్లంతయ్యిందని అధికారులు వెల్లడించారు. కొంతకాలంగా హరీశ్ రావత్ డెహ్రాడూన్ లో నివసిస్తున్నారు. సిటీలోని నిరంజన్ పూర్ లో 2009 నుంచి ఓటు వేస్తున్నారు.2022 అసెంబ్లీ ఎన్నికల్లోను ఇక్కడే ఆయన ఓటు వేశారు.
మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఓటు వేయడానికి వెళ్లగా ఓటరు జాబితాలో ఆయన పేరు కనిపించలేదు. ఈ నేపథ్యంలో ఓటు హక్కును ఆయన వినియోగించుకోలేకపోయారు. ఓటర్ లిస్ట్ నుంచి పేరు గల్లంతు కావడంపై హరీశ్ రావత్ స్పందించారు. ‘‘ఓటు వేయడానికి ఉదయం నుంచి నేను వేచి చూస్తున్నాను. పోలింగ్ స్టేషన్ కు వెళ్లగా నా పేరు కనిపించలేదు. లోక్ సభ ఎన్నికల్లో నేను ఇక్కడే ఓటు వేశాను. ఓటర్ల లిస్టును బీజేపీ తారుమారు చేస్తున్నది” అని ఆరోపించారు.