
సుహాస్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఓ భామ అయ్యో రామ’. రామ్ గోధల దర్శకుడు. వీ ఆర్ట్స్ పతాకంపై హరీష్ నల్ల నిర్మిస్తున్నారు. మలయాళ నటి మాళవిక మనోజ్ (జో ఫేమ్) ఈ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయం అవుతోంది. దర్శకుడు హరీష్ శంకర్ ఇందులో ఓ అతిథి పాత్రలో కనిపించబోతున్నారు. ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేసేలా ఈ పాత్ర ఉంటుందని చెప్పిన మేకర్స్, ఈ క్యారెక్టర్‌కు అంగీకరించిన హరీష్ శంకర్‌కు థ్యాంక్స్ చెప్పారు.
సున్నితమైన భావోద్వేగాలతో పాటు కడుపుబ్బా నవ్వించే వినోదంతో సుహాస్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచేలా దీన్ని తెరకెక్కిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. ‘నువ్వు నేను’ ఫేమ్ అనిత, అలీ, కీలకపాత్రలు పోషిస్తున్నారు. రధన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.