
కౌడిపల్లి, వెలుగు: బీఆర్ఎస్కు చెందిన నర్సాపూర్మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో మంగళవారం మాజీ మంత్రి హరీశ్ రావు ఆయనతో భేటీ అయ్యారు.
సంగారెడ్డి నుంచి మెదక్ వెళ్లే క్రమంలో హరీశ్ రావు, మాజీ ఎమ్మెల్సీ ఫరూఖ్ హుస్సేన్, ఎమ్మెల్సీ, మెదక్ లోక్ సభ బీఆర్ఎస్అభ్యర్థి వెంకటరామిరెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత రెడ్డి కౌడిపల్లిలోని మదన్ రెడ్డి ఇంటికి వెళ్లారు. దాదాపు 20 నిమిషాల పాటు హరీశ్రావుఆయనతో మాట్లాడారు. పార్టీ మార్పు గురించి జరుగుతున్న ప్రచారం గురించి చర్చించినట్టు తెలిసింది.