కురవి, వెలుగు : మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్న కిషన్‌నాయక్ దశదినకర్మ మహబూబాబాద్ జిల్లా గుండ్రాతిమడుగు పెద్దతండాలో శుక్రవారం జరిగింది. కార్యక్రమానికి మాజీ మంత్రులు హరీశ్‌రావు, దయాకరరావు, మాజీ ఎమ్మెల్యేలు శంకర్‌నాయక్, రెడ్యానాయక్, గండ్ర వెంకటరమణారెడ్డి, హరిప్రియ, పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వెంకట్రావు, కోరం కనకయ్య, రామచంద్రునాయక్, ఎమ్మెల్సీ బండా ప్రకాశ్, మహబూబాబాద్ జడ్పీ చైర్మన్ బిందు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కిషన్‌నాయక్ ఫొటో వద్ద నివాళి అర్పించిన అనంతరం సత్యవతి రాథోడ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి వెంట కురవి జడ్పీటీసీ బండి వెంకట్‌రెడ్డి, నూకల నరేశ్‌రెడ్డి, మూల మధుకర్‌రెడ్డి ఉన్నారు.