నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించండి

  •  సీఎంకు హరీశ్‌‌రావు లేఖ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని నిరుద్యోగుల స‌‌మ‌‌స్యలను పరిష్కరించాలని కోరుతూ సీఎం రేవంత్‌‌రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హ‌‌రీశ్‌‌రావు ఆదివారం బ‌‌హిరంగ లేఖ రాశారు. గ్రూప్-1 మెయిన్స్‌‌కు1:100 రేషియోలో అభ్యర్థులను ఎంపిక చేయాలని, గ్రూప్-2, 3 పోస్టుల సంఖ్యను పెంచాలని కోరారు. 

  డీఎస్సీని మూడు నెల‌‌ల పాటు వాయిదా వేయాల‌‌ని  లేఖ‌‌లో పేర్కొన్నారు. అధికారంలోకి రాగానే ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న హామీని కూడా నెరవేర్చాలని సూచించారు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు నెలకు రూ. 4000 చొప్పున నిరుద్యోగ భృతి ఇవ్వాలన్నారు. జీవో నంబర్ 46ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.