శ్మశానంలో ‘హరితహారం’ నర్సరీ

శ్మశానంలో ‘హరితహారం’ నర్సరీ

వెలుగు, హన్వాడ : ‘హరితహారం’ కోసం ప్రైవేట్ ​స్థలాల్లో నర్సరీ నిర్వహిస్తే బిల్లులు రావడం లేదని, మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం రామన్నపల్లిలో అధికారులు ఏకంగా వైకుంఠధామంలోనే నర్సరీ ఏర్పాటు చేశారు. ఇక్కడ సీతాఫలం, కొబ్బరి, నిమ్మ, గచ్చకాయ, అడవి తంగేడు, గులాబీ, మందారం, పప్పాయ రకాల మొక్కలు పెంచుతున్నారు. గ్రామంలో ఎక్కడా ప్రభుత్వ జాగా లేదని, ప్రైవేట్ స్థలంలో నర్సరీ ఏర్పాటు చేస్తే బిల్లులు మంజూరు కావట్లేదని ఎంపీడీఓ ధనుంజయగౌడ్ తెలిపారు. శ్మశానవాటిక నిరుపయోగంగా ఉండడంతో మొక్కలు పెంచుతున్నామని చెప్పారు.