ఆత్మవిశ్వాసంతో ఉండటంలో, సవాళ్లను ఎదుర్కోవడంలో మహిళలకు సాటెవరూ రారు.. అన్న మాటను నిజం చేసింది పాతికేళ్ల హరిత. నేవీలో ఎప్పటికైనా చేరాలనుకున్న ఆమె కల... ఫిజికల్ టెస్టులో క్వాలిఫై కాకపోవడంతో తీరలేదు. అయినా డిజప్పాయింట్ కాలేదు. ఫిషరీస్ నాటికల్స్‌లో చేరి నెమ్మదిగా ఎదిగింది. ఇప్పుడు ఆమె ఫిష్షింగ్ చేసే షిప్స్‌లో తొలి మహిళా స్కిప్పర్ (కెప్టెన్)గా అర్హత సాధించింది.
కేరళకు చెందిన కె.కె.హరిత మనదేశంలో ఫిషింగ్ షిప్‌లకు మొట్టమొదటి మహిళా కెప్టెన్‌గా సెలక్ట్ అయింది. దీనికోసం ఆమె ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నది. సముద్రంలో జర్నీ చేస్తున్నప్పుడు వాతావరణం పడేది కాదు. విపరీతమైన తలనొప్పి వచ్చేది. చర్మంపై దురద పుట్టేది. చలికి శరీరం తట్టుకునేది కాదు. ఈ పరిస్థితులన్నింటినీ దాటి ట్రైనింగ్ తీసుకుంది. అలా టీమ్ మెంబర్‌గా, చీఫ్ ఆఫీసర్‌గా చేరి కెప్టెన్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. హరితకు చిన్నప్పటి నుంచి నేవీలో చేరాలని డ్రీమ్. అయితే ఫిజికల్ ఈవెంట్స్‌లో అర్హత సాధించలేకపోయింది. అప్పుడే కొచ్చిలోని సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ నాటికల్ అండ్ ఇంజినీరింగ్‌లో చేరింది. ఇది విజయవంతంగా పూర్తి చేస్తే.. సముద్రాల్లో పెద్ద వెజల్స్‌కు లీడర్ అవ్వచ్చన్నది ఆమె ఆలోచన. అలా2016లో ఫిషరీస్ నాటికల్ ఇంజినీరింగ్ కంప్లీట్ చేసింది. ఆరు నెలల పాటు షిప్లో జర్నీ చేసింది. ఆ టీమ్ మొత్తంలో హరిత ఒక్కరే మహిళ. ఇతర టీమ్ మెంబర్స్ ఆమెను స్పెషల్‌గా చూసేవాళ్లు. హరితను బాగా ఎంకరేజ్ చేసేవాళ్లు. అలా 2017లో తన మొదటి షిప్పింగ్ జర్నీ పూర్తయింది. ఫిషింగ్ వెజల్స్లో మేట్ లేదా చీఫ్ ఆఫీసర్ కావడానికి కావాల్సిన కోర్సులు చేసింది. ‘మేట్ ఆఫ్ ఫిషింగ్ వెస్సెల్స్’ పరీక్ష రాసి చీఫ్ ఆఫీసర్‌గా అర్హత సాధించింది. ఆ తర్వాత రెండు సంవత్సరాల్లో 450 రోజులు సముద్రయానం చేసింది హరిత. పదుల సంఖ్యలో ఉండే టీమ్‌కు లీడర్‌గా పని చేసింది. తర్వాత ఆమె స్కిప్పర్ (కెప్టెన్) టైటిల్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది. దాని కోసం 450 రోజులు సముద్రంలో జర్నీ చేసింది. ఆ ఎక్స్‌పీరియెన్స్‌తో దానికి సంబంధించిన కోర్సులు చేసింది. డిసెంబర్ 2020లో స్కిప్పర్ ఎగ్జామ్ రాసింది. 2021 నవంబర్‌లో దాని రిజల్ట్స్ వచ్చాయి. ఆమె స్కిప్పర్ పొజిషన్‌కు సెలక్ట్ అయింది. కాలేజీ తరువాత స్నేహితులంతా హయ్యర్ స్టడీస్‌కు వెళ్లారు. కానీ హరిత మాత్రం సముద్రంలో ఉండాలనే డిసైడ్ అయింది.
‘‘నా కుటుంబమే నా బలం. నా కలను సాకారం చేసుకునేందుకు నా పేరెంట్స్ ఎప్పుడూ సపోర్ట్ ఇచ్చారు. మా అమ్మ మొదట్లో కాస్త ఆందోళన పడినా, తర్వాత నా మీద నమ్మకం పెంచుకుంది. అనేక టెస్టులు, సవాళ్ల తర్వాత కెప్టెన్ టైటిల్ తెచ్చుకోవడం గర్వంగా ఉంది’’ అని చెప్పింది హరిత.